Share News

Problematic Areas సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:46 PM

Special Focus on Problematic Areas స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలు, వార్డులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. సాలూరు పట్టణంలోని సమస్యాత్మక వార్డులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారుకు పలు సూచనలిచ్చారు. వార్డుల్లోని శాంతిభద్రతల పరిస్థితి, గతంలో చోటుచేసుకున్న వివాదాలు, తదితర అంశాలను వారిని అడిగి తెలుసుకున్నారు.

  Problematic Areas సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
సిబ్బందికి సూచనలిస్తున్న ఎస్పీ మాధవరెడ్డి

సాలూరు, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలు, వార్డులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. సాలూరు పట్టణంలోని సమస్యాత్మక వార్డులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారుకు పలు సూచనలిచ్చారు. వార్డుల్లోని శాంతిభద్రతల పరిస్థితి, గతంలో చోటుచేసుకున్న వివాదాలు, తదితర అంశాలను వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక వార్డుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. గత ఎన్నికల సమయంలో వివాదాలకు కారణమైన అంశాలను పరిశీలించాలన్నారు. రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు లొంగరాదని, అన్ని శాఖల సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ బూత్‌లను గుర్తించాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ట్రబుల్‌ మాంగర్స్‌, రౌడీషీటర్స్‌, స్థానిక రాజకీయ నాయకులకు తరచుగా కౌన్సెలింగ్‌ నిర్వహించాలని తెలిపారు. అవసరమైతే బైండోవర్‌ నమోదు చేయలన్నారు. ఈ పరిశీలనలో సాలూరు పట్టణ సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ అనిల్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2026 | 11:46 PM