Share News

Maternal and Child Health మాతా శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

ABN , Publish Date - Aug 25 , 2026 | 11:48 PM

Special Focus on Maternal and Child Health ప్రజారోగ్య కార్యక్రమాలను పక్కాగా అమలు చేస్తూ మాతా శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఎంహెచ్‌వో పి.విజయలక్ష్మి ఆదేశించారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆశా నోడల్‌ అధికారులతో సమీక్షించారు.

  Maternal and Child Health  మాతా శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో విజయలక్ష్మి

పార్వతీపురం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్య కార్యక్రమాలను పక్కాగా అమలు చేస్తూ మాతా శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఎంహెచ్‌వో పి.విజయలక్ష్మి ఆదేశించారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆశా నోడల్‌ అధికారులతో సమీక్షించారు. గర్భిణుల నమోదు, హైరిస్క్‌ గర్భిణుల గుర్తింపు, ఏఎన్‌సీ పరీక్షలు, టీకాలు, ప్రసవాలు, గృహ సదర్శనలపై చర్చించారు. వైద్య సేవల్లో జాప్యం జరిగితే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. క్షయ అనుమానితుల నమూనాలు సేకరించాలని, హ్యాండ్‌హెల్డ్‌ ఎక్స్‌రే సేవలను గ్రామీణులు వినియోగించుకునేలా చూడాలని సూచించారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఆర్‌బీఎస్‌కే అధికారి జగన్మోహన్‌రావు, డీఎల్‌ఏటీవో షేక్‌ హఫీజా, డీపీవో లీలారాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2026 | 11:48 PM