Girls’ Health బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Feb 28 , 2026 | 11:44 PM
Special Focus on Girls’ Health విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపా లని ప్రభుత్వ విప్ జగదీశ్వరి ఆదేశించారు. శనివారం ఆమె కురుపాం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను పరిశీలించారు. డయేరియా లక్షణాలతో బాధపడిన బాలికలతో మాట్లాడి.. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
కురుపాం గురుకుల పాఠశాల పరిశీలన
కురుపాం/పార్వతీపురం,ఫిబ్రవరి28(ఆంధ్రజ్యోతి): విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపా లని ప్రభుత్వ విప్ జగదీశ్వరి ఆదేశించారు. శనివారం ఆమె కురుపాం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను పరిశీలించారు. డయేరియా లక్షణాలతో బాధపడిన బాలికలతో మాట్లాడి.. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత హాస్టల్‌లో పిల్లలకు వండుతున్న ఆహారాన్ని పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, బాలికలకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. ప్రతి వారం పాఠశాలలో విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రిన్సిపాల్ దాలమ్మను ఆదేశించారు. అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న వైద్య శిబిరం పరిశీలించి, బాలికలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీ లనలో ఐటీడీఏ ఏపీవో మురళీధర్,టీడీపీ మండల కన్వీనర్ కొండయ్య తదితరులు ఉన్నారు.