విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:03 AM
రాష్ట్రంలో విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
నెల్లిమర్ల, జూలై 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఉత్తరాంరఽధకే మణిహారంగా భోగాపురం ఎయిర్‌పోర్టు నిలుస్తుందని చెప్పారు. బుధవా రం నెల్లిమర్లలో టీడీపీనాయకుడు సువ్వాడ రవిశేఖర్ అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రపంచపటంలో నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహరెడ్డి, రాధాకృష్ణ, సుబ్బారెడ్డి, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్, నెల్లిమర్ల నియో జకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు, టీడీసీ మండలాధ్యక్షులు కడగల ఆనంద్‌కు మార్, డీసీసీబీ మాజీ వైస్‌చైర్మన్ చనమల్ల వెంకటరమణ, రాజారావు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర ప్రతిష్ఠను కాపాడుకుందాం
డెంకాడ, జూలై 29(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ప్రతిష్ఠను కాపాడుకునే విధంగా ప్రయత్నం చేద్దామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో విమానాశ్రయం ప్రారంభోత్సవం పురస్కరించుకొని నిర్వహించనున్న మహాసభను విజయవంతం చేయడంపై డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో సమీక్షించారు. కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నర్సింహరెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గన్నె వీరాంజనేయులు, అగ్రికల్చర్ మిషనరీ వైస్ చైర్మన్ శ్రీనివాసులురెడ్డి, అప్పలనారాయణ, భాస్కరరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.