Share News

తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:20 AM

రానున్న రెండు నెలల్లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి కోరారు.

తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి

  • కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

  • అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌

విజయనగరం, కలెక్టరేట్‌, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): రానున్న రెండు నెలల్లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి కోరారు. జిల్లాలోని ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురువారం రాత్రి విజయనగరం లోని కలెక్టరేట్‌ నుంచి ఆయన సంబంధిత అధికారులతో వీడి యో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఎల్నినో ప్రభావంతో రెండు నెలలుగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదని తెలిపారు. ఈ వీసీలో సీపీవో బాలాజీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ఈ ఎస్‌ఈ కవిత పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 12:20 AM