Share News

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Sep 04 , 2026 | 12:22 AM

గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌లు ప్రత్యేక దృష్టిసారించి గిరిజనాభివృద్ధి లో భాగంగా ప్రత్యేక నిధులు కేటా యిస్తున్నట్లు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు.

  గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
సీతంపేట: బహుళ ప్రయోజన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభిస్తున్న జయకృష్ణ:

సీతంపేట,సెప్టెంబరు 3(ఆంధ్ర జ్యోతి): గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌లు ప్రత్యేక దృష్టిసారించి గిరిజనాభివృద్ధి లో భాగంగా ప్రత్యేక నిధులు కేటా యిస్తున్నట్లు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు. గురు వారం రోలుగుడ్డి పంచాయతీ పరిధి లోని గౌరి పొలంగూడలో పీఎం జన్‌ మన్‌ పథకం కింద రూ. 60లక్షలతో నిర్మించిన బహుళ ప్రయోజన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభిం చారు. కార్యక్రమంలో ఎంపీడీవో బిబి మిశ్రో, టీడబ్ల్యూ ఈఈ పి.రమాదేవి, ఆర్ట్స్‌ సంస్థ డైరెక్టర్‌ ఎన్‌.సన్యాసిరావు, డీఈఈ నాగభూషణం, సీడీపీవో సిమ్మాలమ్మ, ఏసీడీపీవో శాంతికుమారి పాల్గొన్నారు.

క్రీడల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలి

వీరఘట్టం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): యువత క్రీడల్లో నైపుణ్యం పెంపొందిం చుకొని జాతీయస్థాయిలో రాణించాలని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కోరారు. వీరఘట్టంలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రస్థాయి రన్నింగ్‌ పోటీల్లో పాల్గొన్న క్రీడా కారులు పెద్దింట్డిసంజన, లీలాప్రసాద్‌, శాసపు నందకిషోర్‌ను ఎమ్మెల్యే అభినందించి స్పోర్ట్స్‌ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో జామి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Sep 04 , 2026 | 12:22 AM