Special Electoral Roll జూలై నుంచి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ
ABN , Publish Date - May 25 , 2026 | 11:40 PM
Special Electoral Roll Revision from July ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఆర్వో కె.హేమలత అన్నారు. సోమవారం తన చాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
పార్వతీపురం, మే25(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఆర్వో కె.హేమలత అన్నారు. సోమవారం తన చాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జూలై నుంచి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపడుతున్నట్టు ఆమె తెలిపారు. దీనిలో భాగంగా జూన్ 5 నుంచి 14 వరకు సిబ్బందికి శిక్షణ ఉంటుందని వెల్లడించారు. జూలై 14 వరకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటా సర్వే చేపడతారని స్పష్టం చేశారు. ఆ తేదీలోగా పోలింగ్ స్టేషన్ల పరిశీలన తనిఖీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు, క్లయిమ్‌ల స్వీకరణ కార్యక్రమం ఉంటుందన్నారు. సెప్టెంబరు 18 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి 22న తుది ఓటరు జాబితా ప్రకటిస్తామని తెలిపారు.