Share News

Intermediate Students ఇంటర్‌ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

ABN , Publish Date - Jul 25 , 2026 | 11:42 PM

Special Classes for Intermediate Students నీట్‌, ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఇంటర్‌ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖాధికారి (డీఐఈవో) హర గోపాల్‌ తెలిపారు.

 Intermediate Students ఇంటర్‌ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
విద్యార్థులతో మాట్లాడుతున్న డీఐఈవో హర గోపాల్‌

కురుపాం, జూలై25(ఆంధ్రజ్యోతి): నీట్‌, ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఇంటర్‌ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖాధికారి (డీఐఈవో) హర గోపాల్‌ తెలిపారు. విద్యార్థులు ఈ క్లాసులను సద్వినియోగం చేసుకుని ఉత్తమ ర్యాంకులు సాధించాలని కోరారు. శనివారం కురుపాం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు, ల్యాబ్‌ను పరిశీలించారు. ప్రభుత్వం అందిస్తున్న పాఠ్యపుస్తకాలు , నోట్‌ బుక్స్‌, లెర్నింగ్‌ మెటీరియల్‌ను విద్యార్థులు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో చదివి .. లక్ష్యాల సాధనకు తీవ్రంగా కృషి చేయాలన్నారు. కురుపాం కళాశాల విద్యార్ధి నీట్‌లో మెరిసి అమరావతిలో ఫ్రీ సీట్‌ సాధించడం గొప్ప విషయమని చెప్పారు. ఈ ఏడాది కూడా మంచి ర్యాంక్‌లు సాధించాలన్నారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట ప్రిన్సిపాల్‌ ఎం.కుమారస్వామి, అధ్యాపకులు తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 25 , 2026 | 11:42 PM