Share News

పట్టణాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తా

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:27 AM

పార్వతీపురం పట్టణాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ద చూపించనున్నట్లు కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

పట్టణాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తా
మునిసిపాలిటీ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

- కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

- పార్వతీపురం మునిసిపాలిటీ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు

పార్వతీపురంటౌన్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం పట్టణాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ద చూపించనున్నట్లు కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. గురువారం పార్వతీపురం మునిసిపాలిటీ ప్రత్యేకాధికారిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించడమే తన ప్రాథమిక లక్ష్యమన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజలకు తాగునీటి ఎద్దడి కలగకుండా ముందస్తు చర్యలు చేపడతామన్నారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని, చెత్త సేకరణ ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌కు ఇన్‌చార్జి కమిషనర్‌ శ్రీనివాసరావు, మెప్మా పీడీ నాగభూషణరావు తదితరులు అభినందనలు తెలిపారు.

Updated Date - Mar 20 , 2026 | 12:27 AM