చెరువుల సుందరీకరణపై ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Jul 26 , 2026 | 01:14 AM
పట్టణంలోని చెరువుల సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర తెలిపారు. శనివా రం పట్టణంలోని జగన్నాఽథ పురంపాత్రుడు కోనేరు సుందరీకరణ పనులను ప్రారంభించారు.
పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర
పార్వతీపురంటౌన్ , జూలై 25 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని చెరువుల సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర తెలిపారు. శనివా రం పట్టణంలోని జగన్నాఽథ పురంపాత్రుడు కోనేరు సుందరీకరణ పనులను ప్రారంభించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సదు పాయాలతో పాటు ఆహ్లద కర వాతావరణాన్ని కల్పిం చాలన్నదే ప్రభుత్వ లక్ష్య మన్నారు. పాత్రుడు కోనేరు సుందరీకరణకు సంబంధించి ప్రజల వినతుల మేరకు ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే విజయచంద్ర జగన్నాఽథపురంలోని ఒకటి, రెండు 29, 30వ వార్డుల ప్రజల సమస్యలను విన్నారు.
విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
పార్వతీపురం రూరల్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు వెంకంపేట పంచాయతీ పరిధిలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే విజయచంద్రను సంఘం బి-12, 45 ఏపీ డీపీఎల్ కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్, రీజనల్ కార్యదర్శి బి.తేజేశ్వరరావు నాయకత్వంలో సంఘం ప్రతినిధులు రాము, గిరిబాబు, ఎల్లంనాయుడు, అప్పలస్వామి, సీతంనాయుడు వినతిపత్రం అందించారు. కాగా నర్సిపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని నాగిరెడ్డి హారికను ఎమ్మెల్యే విజయచంద్ర అభినందించారు. బ్యాండ్ బాలు క్రీడల్లో ప్రతిభ చూపడంతో పది వేల రూపాయల నగదును అందించారు.