చిన్నారుల ఆర్యోగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:09 AM
అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకో వాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు.
ఎమ్మెల్యే నాగమాధవి
23 వరకు ‘పోషణ్ పక్వాడా’
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అవగాహన
భోగాపురం, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకో వాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. గురువా రం ముంజేరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆమె విడుదలచేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో లావణ్య, సూపర్‌వైజర్లు, అంగ న్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
పోలిపల్లి పీహె చ్‌సీలో ఐసీడీఎస్ సీడీపీవో లావణ్య గురువారం సమా వేశం నిర్వహించి.. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై పలు సూచనలు చేశారు. అనంతరం భోగాపురం ఐసీడీ ఎస్ కార్యాలయంలో అం గన్‌వాడీ కార్యకర్తలకు పోషణ పక్వాడాపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 9నుంచి 23వ తేదీ వరకు నిర్వహించాలని సూచించారు.
గజపతినగరం, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): గర్భిణు లు పోషకాహారం తీసుకుంటే పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని స్థానిక ఏరియా ఆసుపత్రి వైద్యాధికారి అరుణకుమారి అన్నారు. పోషణ్ పక్వాడా కార్య క్రమంలో భాగంగా గురువారం స్థానిక ఏరియా ఆసుప త్రిలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని గర్భిణులకు పోష కాహారంపై ఆమె అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ పీవో రాజేశ్వరి, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.