Share News

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:58 PM

నగర పంచాయతీలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పేర్కొన్నారు.

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే జయకృష్ణ

- ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ

పాలకొండ, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): నగర పంచాయతీలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పేర్కొన్నారు. మెగా వార్డు క్లీనింగ్‌ ప్రోగ్రాం సమావేశాన్ని నగర పంచాయతీ కార్యాల యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర మున్సిపల్‌ శాఖామంత్రి నారాయణ నగర పంచాయతీలో పారిశుధ్యం నిమిత్తం రూ.5 లక్షలు కేటాయించారన్నారు. ఈ పనులను సమ ర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అనంతరం నగర పంచాయతీ కార్యాలయం ముందు మెగా వార్డు క్లీనింగ్‌ ప్రోగ్రాం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో నగర పంచాయతీ ప్రత్యేకాధికారి, సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ పవర్‌ జగన్నాథ్‌, కమిషనర్‌ రత్నం రాజు, టీడీపీ అరకు పార్లమెంటరీ అధికార ప్రతినిధి గంటా సంతోష్‌కుమార్‌, నాయకులు సుంకరి అనీల్‌దత్‌, కొంచాడ అరుణ్‌కుమార్‌, అడపా బాబ్జీ, రాంబాబు, కొరి కాన గంగునాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

వేసవిలో మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు ఎల్‌ఎల్‌పురం గ్రామస్తులు శనివారం కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని చెరువు ఎండిపోవడంతో తాగడానికి నీరు లేక పశువులు ఇబ్బందులు పడేవి. ఎమ్మెల్యే ఆదే శాలతో తోటపల్లి కాలువ ద్వారా నీటిపారుదల శాఖాధికారులు నీటిని విడిచిపెట్టడంతో గ్రామంలోని చెరువు నిండింది. దీంతో పాడి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఇరిగేషన్‌ అధి కారి ఫకీరునాయుడుకు పోరెడ్డి కృష్ణమాస్టర్‌, జన సేన నాయకులు ధన్యవాదాలు తెలిపారు.

సీఎం సహాయనిధి అందజేత

పాలకొండ /వీరఘట్టం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): సీఎం సహాయనిధి పేదలకు అభయహస్తమని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పేర్కొన్నారు. పాలకొండ, వీరఘట్టం నియోజకవర్గాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను శనివారం ఆయన పంపిణీ చేశారు. పాలకొండ మండలం అంపిలి గ్రామానికి చెందిన దుప్పాడ అన్నపూర్ణమ్మకు రూ.23,920, వీరఘట్టం మండలం ఎం.రాజపురం గ్రామానికి చెందిన కరకవలస లక్ష్మమ్మకు రూ.20,901 అందించారు. కార్య క్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 11:58 PM