Share News

‘శిశుగృహ చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలి’

ABN , Publish Date - Apr 30 , 2026 | 12:28 AM

జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న శిశుగృహ చిన్నారులపై ప్రత్యే క దృష్టి సారించాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యురాలు డా.పి.నాగమానస పిలుపునిచ్చారు.

‘శిశుగృహ చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలి’

విజయనగరం టౌన్‌, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న శిశుగృహ చిన్నారులపై ప్రత్యే క దృష్టి సారించాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యురాలు డా.పి.నాగమానస పిలుపునిచ్చారు. నగరం లోని కేఎల్‌పురంలో నిర్వహిస్తున్న శిశుగృహాన్ని ఆమె బుధవారం సందర్శించారు. ఈసందర్భంగా ఆమె చిన్నా రులను పరిశీలించి, వారిని ఎత్తుకుని ముద్దాడారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ శిశుగృహాల్లో ఉన్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. శిశుగృహా న్ని పరిశుభ్రంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. అలాగే అక్కడ వసతి పొందుతున్న చిన్నారికి హాసిని అని నామకరణం చేశారు. ఈ పర్యవేక్షణలో ఆమెతో పాటు పీడీ బాలామణి, డీసీపీయూ భీంపల్లి లక్ష్మి, శిశుగృహ మేనేజర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2026 | 12:28 AM