Share News

పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: డీపీవో

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:18 AM

వర్షాకాలం దృష్ట్యా ప్రతి గ్రామంలో పారిశుధ్యం, తాగునీరుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరా వు అన్నారు.

పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: డీపీవో

డెంకాడ, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): వర్షాకాలం దృష్ట్యా ప్రతి గ్రామంలో పారిశుధ్యం, తాగునీరుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరా వు అన్నారు. స్వచ్ఛాంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయన శనివారం డెంకాడను సందర్శిం చారు. ర్యాలీలో పాల్గొని పారిశుధ్య పనులు పరిశీలిం చారు. వర్షాకాలం దృష్ట్యా మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో కాలువలు శుభ్రం చేయించాలని, పీడబ్ల్యూ ఎస్‌ ట్యాంకులు శుభ్రం చేసి.. క్లోరినేషన్‌ అయ్యే విధం గా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూ టీ ఎంపీడీవో దేశెట్టి శ్రీనివాసరావు, డెంకాడ పంచా యతీ ప్రత్యేక అధికారి దినేష్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సుభాషిణి, పంచాయతీ సెక్రటరీ లక్ష్మణరావు, బీజేపీ నాయకులు కర్రి కృష్ణ, సచివాలయ, వైద్య, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 12:18 AM