Share News

గోవా గవర్నర్‌ అశోక్‌తో స్పీకర్‌ భేటీ

ABN , Publish Date - Apr 19 , 2026 | 12:13 AM

గోవా రాష్ట్ర గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజును శనివారం శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, ఆయన కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.

గోవా గవర్నర్‌ అశోక్‌తో స్పీకర్‌ భేటీ
తైక్వాండో పోటీల పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు, స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, మంత్రి కొండపల్లి తదితరులు

విజయనగరం, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): గోవా రాష్ట్ర గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజును శనివారం శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, ఆయన కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్‌ బంగాకు శనివారం ఉదయం చేరుకున్న ఆయన వేంకటేశ్వరస్వామి ప్రతిమను అందించారు. శాలువాతో సత్కరించారు. వీరిద్దరూ వివిధ అంశాల పై చర్చించుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన శాసనసభ సమావేశాలు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరుగుతున్న తీరును వివరించారు. శాసనసభలో వివిధ అంశాలపై జరుగుతున్న చర్చలు, కొత్త సభ్యులకు అవకాశం తదితర వాటిపై అయ్యన్న పాత్రుడు... అశోక్‌ గజపతిరాజుకి వివరించారు. అనంతరం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ తదితరులు గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు, శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడిని కలిశారు. మంత్రి శ్రీనివాస్‌ కూడా వివిధ అంశాలపై గవర్నర్‌, స్పీకర్లతో చర్చించారు. ఈ కార్యక్రమంలో అశోక్‌ గజపతిరాజు సతీమణి సునీలా గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.

ఫ శృంగవరపుకోట, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజును శృంగవరపుకోట శాసన సభ్యురాలు కోళ్ల లలిత కుమారి, కోళ్ల బాలాజీ అప్పలరామ ప్రసాద్‌ దంపతులు మ ర్యాదపూర్వకంగా కలి శారు. శనివారం విజయనగరం లోని అశోక్‌ బంగ్లాలో గోవా గవర్నర్‌ను క లిసి... పుష్పగుచ్ఛం అందిం చారు.

తైౖక్వాండో పోటీల పోస్టర్‌ ఆవిష్కరణ

విజయనగరం రూ రల్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 5, 6 తేదీల్లో విజయనగరం రాజీవ్‌ స్టేడియంలో రాష్ట్ర స్థాయి తైక్వాండో ఛాంపియన్‌షిప్‌ పోటీలను నిర్వహిం చనున్నారు. ఈ పోటీల షెడ్యూల్‌కు సంబంధించిన పోస్టర్‌ను శనివారం గవర్నర్‌ బంగ్లాలో గోవా రాష్ట్ర గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు, స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ తదితరులు ఆవిష్కరించారు. ఈ మెగా ఈవెంట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500 మంది క్రీడాకారులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్‌ తైక్వాండో అసోసియేషన్‌ అధ్యక్షుడు గురాన అయ్యలు, రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్‌ కార్యదర్శి సీహెచ్‌ వేణుగోపాల్‌, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి, నాయకులు అవనాపు విజయ్‌, బొద్దల నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 12:13 AM