గాయపడిన మహిళకు ఎస్పీ సపర్యలు
ABN , Publish Date - Jul 19 , 2026 | 11:58 PM
భోగాపురం మండలం లింగాలవలస జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళకు ఎస్పీ ఏఆర్ దామోదర్ సపర్యలు చేసి.. అంబులెన్స్‌పై ఆసుపత్రికి తరలించారు.
పూసపాటిరేగ(భోగాపురం), జూలై 19(ఆంధ్రజ్యోతి): భోగాపురం మండలం లింగాలవలస జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళకు ఎస్పీ ఏఆర్ దామోదర్ సపర్యలు చేసి.. అంబులెన్స్‌పై ఆసుపత్రికి తరలించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పరిశీలనకు వచ్చిన ఎస్పీ తిరిగి వెళ్తున్న సమయంలో.. లింగాలవలస వద్ద బైకు ప్రమాదానికి గురై రోడ్డుపై పడిపోయిన మహిళను గమనించారు. వెంటనే ఆయన గాయపడిన మహిళ వద్దకు వెళ్లి, సపర్యలు చేశారు. అటుగా వస్తున్న అంబులెన్స్‌ను ఆపి స్థానికుల సహకారంతో అందులో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. భోగాపురం సీఐకి సమాచారం అందజేశారు. వెంటనే తదుపరి చర్యలు చేపట్టాలని ఆయన పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.