Share News

సీఎం భద్రతపై ఎస్పీ సమీక్ష

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:37 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 19న భోగా పురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం కానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ శుక్రవారం సమీక్షించారు.

సీఎం భద్రతపై ఎస్పీ సమీక్ష

భోగాపురం, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 19న భోగా పురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం కానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ శుక్రవారం సమీక్షించారు. విశాఖ పట్నం ఇంజినీరింగ్‌ కళాశాల గ్రౌండ్‌లో ము ఖ్యమంత్రి ఈనెల 19న లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం తిరుగు ప్రయాణం కానున్నారు. దీనికి సంబంధించి భద్రతా ఏర్పాట్లపై సీఐ ఎస్‌ఎఫ్‌, జీఎంఆర్‌, ఇతర శాఖల అధికారుల తో ఎస్పీ సమీక్షించారు. అలాగే ఎయిర్‌పోర్టు లో భద్రతా చర్యలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ పి.కిరణ్‌కుమార్‌, బొబ్బిలి డీఎస్పీ గోవిందరావు, సీఐ కె.దుర్గాప్ర సాదరావు పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 12:37 AM