“Somburu… A Success!” సొంబురు.. సక్సెస్!
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:29 AM
“Somburu… A Success!” కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎఫ్‌ఆర్‌ఎస్(ముఖ ఆధారిత నమోదు)యాప్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల కారణంగా ఉపాధి వేతనదారులు ఇబ్బందులకు గురవుతున్న సంగతి తెలిసిందే. సీతంపేట మండలం అక్కడగూడకి చెందిన సవర సొంబురు అనే వేతనదారుడు కూడా రెండు రోజులుగా ఉపాధి పనికోసం వెళ్లడం, ఫేస్ యాప్‌లో నమోదు కాక నిరాశతో ఇంటిదారి పట్టడం పరిపాటిగా మారింది.
ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో నమోదు
నవ్వులు పూయించిన గిరిజనుడి చర్య
సీతంపేట రూరల్, ఏప్రిల్8(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎఫ్‌ఆర్‌ఎస్(ముఖ ఆధారిత నమోదు)యాప్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల కారణంగా ఉపాధి వేతనదారులు ఇబ్బందులకు గురవుతున్న సంగతి తెలిసిందే. సీతంపేట మండలం అక్కడగూడకి చెందిన సవర సొంబురు అనే వేతనదారుడు కూడా రెండు రోజులుగా ఉపాధి పనికోసం వెళ్లడం, ఫేస్ యాప్‌లో నమోదు కాక నిరాశతో ఇంటిదారి పట్టడం పరిపాటిగా మారింది. దీంతో విసిగిపోయిన సొంబురు కొత్తగా ఆలోచించాడు. బుధవారం తన ముఖానికి అధికంగా పౌడర్‌ను పూసుకుని పనికి వెళ్లాడు. మేట్ ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో ఆయన ముఖాన్ని అప్‌లోడ్ చేశాడు. అయితే సొంబురు పేరు సక్సెస్ అని రావడంతో తోటి వేతనదారులు ముక్కున వేలేసుకున్నారు. ఇదేం చోద్యం అని అం దరూ నవ్వుకున్నారు. ఇకపై ఉపాధి పనికి తాము కూడా ముఖానికి అధిక పౌడర్ వేసుకొని వస్తామని వేతనదారులు ఉపాధి మేట్‌కు చెప్పారు.