చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరించండి
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:59 PM
పీజీఆర్‌ఎస్‌కు అందిన అర్జీలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
కురుపాం, జనవరి22 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌కు అందిన అర్జీలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు ప్రభుత్వ విప్ జగదీశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో పాటు జేసీ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ప్రజల నుంచి 68 వినతులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ అందిన ప్రతి అర్టీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యలు పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.