Share News

సమస్యలను పరిష్కరించండి

ABN , Publish Date - Feb 22 , 2026 | 11:37 PM

గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే, ఏజేఏసీ మన్యం జిల్లా గౌరవ అధ్యక్షుడు నిమ్మక జయరాజు ప్రభుత్వ విప్‌ జగదీశ్వరిని కోరారు.

సమస్యలను పరిష్కరించండి
ప్రభుత్వ విప్‌ జగదీశ్వరికి వినతిపత్రం అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే జయరాజు

గుమ్మలక్ష్మీపురం/జియ్యమ్మవలస, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే, ఏజేఏసీ మన్యం జిల్లా గౌరవ అధ్యక్షుడు నిమ్మక జయరాజు ప్రభుత్వ విప్‌ జగదీశ్వరిని కోరారు. ఆదివారం క్యాంప్‌ కార్యాలయంలో ఆమెకు ఏజేఏసీ సభ్యులతో కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో కురుపాం మండలం నీలకంఠాపురం ప్రధాన కేంద్రంగా గిరిజన ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే గతంలో సు ప్రీం కోర్టులో జీవో నెంబరు 3 రద్దయిన కారణంగా ఆదివాసీ మనుగడకు నష్టం కలగకుండా ఆంధ్రప్రదేశ్‌ ట్రైబుల్‌ ఎడ్వైజరీ కమిటీ (ఏపీటీఏసీ) నూతన చట్టం సవరణ ప్రక్రియను వేగవంతం చేయించాలని కోరారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందించారని, అవసరమైతే సంబంధిత మంత్రులతో నేరుగా కలిసే ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏజేఏసీ నాయకులు హిమరిక నీలకంఠేశ్వరరావు, ఎ.మన్మఽథరావు, బిడ్డిక రామారావు, బిడ్డిక కడాయి, ఏజేఏసీ మండల కన్వీనర్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి బిడ్డిక వెంకటరమణ పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 11:37 PM