రెవెన్యూ సమస్యలు పరిష్కరించుకోండి
ABN , Publish Date - May 08 , 2026 | 12:46 AM
రెవెన్యూ సమస్యలను పరిష్కరించుకోవాలని సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ప్రజలకు పిలుపునిచ్చారు.
పాలకొండ, మే 7 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సమస్యలను పరిష్కరించుకోవాలని సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం సింగన్నవలస గ్రామాన్ని తహసీల్దార్ సీహెచ్.రాధా కృష్ణమూర్తితో కలిసి సందర్శించారు. గ్రామ ప్రజలతో సమావేశమై వారి వెన్యూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒక గ్రామం-ఒక నెల- నాలుగు సందర్శనలు కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పించిందన్నారు. ప్రతి గురువారం అధికారులు గ్రామానికి నెలలో నాలుగుసార్లు వచ్చి ప్రజల సమస్యలను పరిష్కరిస్తారన్నారు. సంబంధిత గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం గ్రామంలోని విలేజ్‌హెల్త్ క్లినిక్‌ను సబ్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగుల నమోదు వివరాలు, మందుల నిల్వలు అందుబాటుపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. కార్య క్రమంలో ఎంఎస్‌వో శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.