Share News

సమస్యలు పరిష్కరించండి

ABN , Publish Date - Jul 26 , 2026 | 01:17 AM

సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి ఆదేశించారు.

 సమస్యలు పరిష్కరించండి
గుమ్మలక్ష్మీపురం: వినతిని స్వీకరిస్తున్న జగదీశ్వరి

  • కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం, జూలై 25 (ఆంధ్రజ్యోతి): సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి ఆదేశించారు. శనివారం గుమ్మలక్ష్మీపురంలోని క్యాంప్‌ కార్యాల యంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్య క్రమంలో కురుపాం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ కడ్రక కళావతి, అరకు పార్లమెంట్‌ సహాయ కార్యదర్శి తాడంగి రామారావు, అరకు పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

గరుగుబిల్లి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కోరారు. శనివారం ఉల్లిభద్ర సమీపంలోని ఎర్రన్నగుడి సముదాయంలో నిర్వహించిన వైద్యపరీక్ష శిబిరాన్ని పరిశీలించారు. కార్యక్రమం లో కార్పొరేషన్‌ డైరెక్టర్లు ఎ.తవిటినాయుడు, ఎ.మధుసూదనరావు, టీడీపీ నాయ కులు ఎం.నారాయణస్వామి, డి.సత్యనారాయణ, విజయవాంకుశం, పూర్ణచంద్రరా వు, కె.బలరాంనాయుడు, ఎం.పురుషోత్తంనాయుడు, బి.జగదీష్‌, పి.పాపినాయుడు పాల్గొన్నారు. కాగా కేఆర్‌ఎన్‌ వలసకు చెందిన మండల పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యులు షేక్‌ యాసిన్‌ ఇటీవల మృతిచెందడంతో కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు.

Updated Date - Jul 26 , 2026 | 01:17 AM