Share News

ఆర్థిక సమస్యలను పరిష్కరించండి’

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:31 AM

ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర నాయకుడు జేసీ రాజు డిమాండ్‌ చేశారు.

ఆర్థిక సమస్యలను పరిష్కరించండి’
మాట్లాడుతున్న ఏపీటీఎఫ్‌ నాయకులు

‘బొబ్బిలి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర నాయకుడు జేసీ రాజు డిమాండ్‌ చేశారు. స్ధానిక ఏపీటీఎఫ్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పండుగలు వస్తున్నాయి.. పోతున్నాయి కానీ ప్రభుత్వం నుంచి శుభవార్త రావడంలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే తమ సమస్యను పరిష్కరించకుండా మరుగునపెట్టారన్న భావన కలుగుతోందన్నారు. 2023 జూలై నుంచి 12వ పీఆర్‌సీని అమలు చేయాలన్నారు. 30శాతం మధ్యంతర భృతిని చెల్లించాలన్నారు. నాలుగు పెండింగ్‌ డీఏలు, 2022 నుంచి సరెండర్‌ లీవు బకాయిలు, సీపీఎస్‌ ఉద్యోగులు, పింఛన్‌దారులకు నగదురూపంలో బకాయిలు, పీఎఫ్‌ రుణాలు, ఏపీజీఎల్‌ఐ చెల్లింపు జాప్యం నివారణ, 11వ పీఆర్‌సి బకాయిలు, పదవీవిరమణ బెనిఫిట్స్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. శనివారం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ప్రకటన చేయాలన్నారు. లేకుంటే పోరుబాట పడతామని జేసీ రాజు హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ నాయకులు సీహెచ్‌జే ప్రవీణ్‌కుమార్‌, చిన్నారావు, శర్మ, యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2026 | 12:31 AM