Share News

నవంబరు 22న ఏకపాత్రాభినయ పోటీలు

ABN , Publish Date - Oct 26 , 2026 | 12:18 AM

రాజాంలో నవంబరు 22వ తేదీన ఏకపా త్రాభినయ పోటీలు నిర్వహించనున్నట్టు పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్ల గోపాలరావు, ప్రధాన కార్యదర్శి అర్నిపల్లి వెంకటనాయుడు తెలిపారు.

నవంబరు 22న ఏకపాత్రాభినయ పోటీలు

రాజాం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): రాజాంలో నవంబరు 22వ తేదీన ఏకపా త్రాభినయ పోటీలు నిర్వహించనున్నట్టు పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్ల గోపాలరావు, ప్రధాన కార్యదర్శి అర్నిపల్లి వెంకటనాయుడు తెలిపారు. ఈసందర్భంగా ఆదివారం రాజాం లో బ్రోచర్‌ను విడుదల చేశారు. వచ్చే నెల 22వ తేదీ ఉదయం 9 గంటలకు వస్త్రపురి కాలనీలో జీసీఎస్‌ఆర్‌ కళాక్షేత్రంలో పోటీలు ప్రారంభమవుతాయని వెల్ల డించారు. పోటీల్లో పాల్గొనదలచినవారు ప్రదర్శించనున్న పాత్ర సంభాషణతో పా టు రెండు పద్యాలను హార్మోనియం శబ్దం తగ్గించి వీడియో తీసి.. పేరు, ఫోన్‌ నెంబరు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ ఫాస్‌పోర్టు సైజు ఫోటోతో నవంబరు 6వ తేదీలోగా 94417 56874, 8897052000, 6305236018 నెంబర్లకు వాట్సాప్‌ చేయాలని సూచించారు. ఎంపికైన వారి పేర్లను నవంబరు 12న ప్రకటిస్తామని చెప్పారు. ప్రదర్శన నిడివి 10 నుంచి 15 నిమిషాలు ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్ర మంలో కొత్తా సాయిప్రశాంత్‌కుమార్‌, పెంకి చైతన్యకుమార్‌, బీవీ అచ్యుత్‌ కుమార్‌, గట్టి పాపారావు, మెట్ట దామోదరరావు, మంతపూడి ప్రసాద్‌, కరణం శంకరరావు, రంపా జగదీష్‌శర్మ, బెవర ముకుంద నాయుడు, అమరాపు కృష్ణ మూర్తి పాల్గొన్నారు.

Updated Date - Oct 26 , 2026 | 12:18 AM