Share News

‘Solar’ Lights ఎస్సీ, ఎస్టీలకు ‘సౌర’ వెలుగులు

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:53 PM

‘Solar’ Lights for SCs and STs జిల్లాలో ఎస్సీ, ఎస్టీల కుటుంబాలకు సౌర వెలుగులు అందించేందుకు సర్వం సిద్ధమైంది. నేడు సూర్య ఘర్‌ పథకం ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సాలూరు మండలం కొత్తవలసలో సోమవారం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ పథకం ప్రారంభించనున్నారు.

‘Solar’ Lights  ఎస్సీ, ఎస్టీలకు   ‘సౌర’ వెలుగులు
కొత్తవలసలో సిద్ధం చేసిన సోలార్‌ ప్యానళ్లు

సాలూరు రూరల్‌, ఏప్రిల్‌12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎస్సీ, ఎస్టీల కుటుంబాలకు సౌర వెలుగులు అందించేందుకు సర్వం సిద్ధమైంది. నేడు సూర్య ఘర్‌ పథకం ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సాలూరు మండలం కొత్తవలసలో సోమవారం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ పథకం ప్రారంభించనున్నారు. ఆ గ్రామంలో 180 గిరిజనుల కుటుంబాలకు సౌర విద్యుత్‌ సరఫరా చేయనున్నారు. వాస్తవంగా జిల్లాలో దళిత, గిరిజన కుటుంబాలకు 200 యూనిట్లు విద్యుత్‌ను ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం విస్తృత కార్యాచరణ చేసింది. ఈ మేరకు 14,110 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సూర్యఘర్‌ పథకంలో సోలార్‌ సిస్టంను పూర్తి ఉచితంగా అందించనున్నారు. దాదాపు రూ. 2 లక్షల విలువైన పథకానికి ఎస్సీ,ఎస్టీలకు పూర్తిగా ఉచితంగా అందిస్తుండగా ఇతరులకు 40 శాతం రాయితీపై అందిస్తున్నారు. కాగా ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా వివిధ గ్రామాల్లో 600 ఇళ్లకు సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేశారు. మూడు నెలల్లోగా మొత్తం 14,110 ఇళ్లను సూర్యఘర్‌గా మార్చడానికి కార్యాచరణ చేశారు. 2 కేవీ సోలార్‌ విద్యుత్‌ సిస్టంను ఇళ్లపై ఏర్పాటు చేసుకున్నందుకు ఉచిత విద్యుత్‌తో పాటు రూ. 200ను ప్రతి నెలా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయనున్నారు.

Updated Date - Apr 12 , 2026 | 11:53 PM