Share News

గోశాల ముసుగులో పశువుల అక్రమ రవాణా

ABN , Publish Date - Jun 02 , 2026 | 12:15 AM

జిల్లాలోని గుర్ల పోలీసుస్టేషన్‌ పరిధిలో గోశాల ముసుగులో పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న అట్టాడ రామ కృష్ణ అనే వ్యక్తిపై పలు కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ దామోదర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 గోశాల ముసుగులో పశువుల అక్రమ రవాణా

  • నిర్వాహకుడిపై కేసుల నమోదు

విజయనగరం, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గుర్ల పోలీసుస్టేషన్‌ పరిధిలో గోశాల ముసుగులో పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న అట్టాడ రామ కృష్ణ అనే వ్యక్తిపై పలు కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ దామోదర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్ల మండలం గుజ్జింగివలసలోని ఓంశక్తి గోశాల పేరుతో అట్టా డ రామకృష్ణ అనే వ్యక్తి అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఇటీవల పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఎస్పీ ఆదేశాల మేరకు చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, సీఐ శంకరరావు, గుర్ల ఎస్‌ఐ నారాయణరావు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అట్టాడ రామకృష్ణ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు వెల్లడయింది. పోలీసులు తమ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న పశువులను స్వాధీనం చేసు కుని.. సాధారణంగా గుజ్జంగివలసలోని ఓంశక్తి గోశాలకు అప్పగిస్తుంటారు. అయి తే నిర్వాహకుడు రామకృష్ణ.. రవాణా చేస్తున్న వారితో కుమ్మక్కయి ఆ పశువు లను తిరిగి వారికే అప్పగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈనేపథ్యంలో రామకృష్ణ సోమవారం 21 పశువులను అచ్యుతాపురం సంతకు అక్రమంగా తరలిస్తుండగా.. గుర్ల పోలీసులు గుర్తించి, పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. పశువులను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Jun 02 , 2026 | 12:15 AM