Share News

Smooth Elections సమన్వయంతో సజావుగా ఎన్నికలు

ABN , Publish Date - Oct 31 , 2026 | 10:25 PM

Smooth Elections Through Coordination పుర ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని జనరల్‌ అబ్జర్వర్‌ చినరాముడు సూచించారు. శనివారం పాలకొండ నగర పంచాయతీలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో డిస్ర్టిబ్యూషన్‌ సెంటర్‌ వద్ద ఏర్పాట్లు, ఎన్నికల సామగ్రి పంపిణీని పరిశీలించారు.

Smooth Elections   సమన్వయంతో సజావుగా ఎన్నికలు
ఎన్నికల సిబ్బందికి మాక్‌ పోలింగ్‌పై అవగాహన కల్పిస్తున్న జనరల్‌ అబ్జర్వర్‌

పాలకొండ, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): పుర ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని జనరల్‌ అబ్జర్వర్‌ చినరాముడు సూచించారు. శనివారం పాలకొండ నగర పంచాయతీలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో డిస్ర్టిబ్యూషన్‌ సెంటర్‌ వద్ద ఏర్పాట్లు, ఎన్నికల సామగ్రి పంపిణీని పరిశీలించారు. అనంతరం సిబ్బందికి మాక్‌ పోలింగ్‌పై అవగాహన కల్పించారు. ఎన్నికల నిర్వహణ పక్కాగా చేయాలని ఆదేశించారు. ఆర్‌వోలకు పలు సూచనలు చేశారు. మధ్యాహ్న భోజనం అనంతరం పోలింగ్‌ కేంద్రాలకు సామగ్రీతో సిబ్బంది తరలివెళ్లారు. ఈ పరిశీలనలో సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, కమిషనర్‌ రాజు తదితరులు ఉన్నారు.

పార్వతీపురంలో 144 సెక్షన్‌: ఏఎస్పీ

పార్వతీపురం టౌన్‌/బెలగాం: ప్రశాంత వాతావరణంలో మున్సిపల్‌ పోలింగ్‌ నిర్వహించేందుకు పోలీసుశాఖ సిద్ధంగా ఉందని ఎస్పీ ఎం. వెంకటేశ్వరరావు అన్నారు. ఇప్పటికే పట్టణంలో 144 సెక్షన్‌ను విధించామని వెల్లడించారు. ఎవరైనా పోలీసుశాఖ నిబంధనలు, ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. పట్టణంలోని 1 సమస్యాత్మక వార్డుల్లో ప్రత్యేక దళాలతో అక్కడ బందోబస్తును ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. కాగా స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి ఎన్నికల సామగ్రితో అధికారులు, సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లారు.

పోలింగ్‌ కేంద్రాల వద్ద వైద్య శిబిరం: డీఎంహెచ్‌వో

పార్వతీపురం, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండలోని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఆదివారం ప్రత్యేక వైద్య శిబి రాలు నిర్వహిస్తున్నట్టు డీఎంహెచ్‌వో విజయలక్ష్మి శనివారం చెప్పారు. తన కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద ఆశ వర్కర్‌, ఏఎన్‌ఎంతో పాటు వైద్యులు కూడా ఉంటారని తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్‌వోలు పద్మావతి, శివ పార్వతి, ప్రోగ్రాం అధికారి శివకుమార్‌ను ప్రత్యేక పర్యవేక్షణ అధికారులుగా నియమించామన్నారు. అనారోగ్య సమస్య తలెత్తితే ఓటర్లు, పోలింగ్‌ సిబ్బంది వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 10:25 PM