Share News

Smokes.. Runs పొగలు.. పరుగులు

ABN , Publish Date - Feb 24 , 2026 | 11:59 PM

Smokes.. Runs ఆ ఆర్టీసీ బస్సు రాజాం నుంచి పాలకొండ వెళ్తోంది. రేగిడి మండలం సంకిలి బస్టాప్‌ వద్దకు చేరేసరికి బస్సులోకి వైరు కాలుతున్న వాసన రావడాన్ని కొందరు గమనించారు. మిగతా వారు కూడా నిజమేనని అంటుండగా పొగి కనిపించింది.

 Smokes.. Runs పొగలు.. పరుగులు
సంకిలి వద్ద ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు నుంచి పొగలు వ్యాపిస్తున్న దృశ్యం

పొగలు.. పరుగులు

ఆర్టీసీ బస్సులో కలకలం

రేగిడి వద్ద ఘటన

రేగిడి, ఫిబ్రవరి 24,(ఆంధ్రజ్యోతి): ఆ ఆర్టీసీ బస్సు రాజాం నుంచి పాలకొండ వెళ్తోంది. రేగిడి మండలం సంకిలి బస్టాప్‌ వద్దకు చేరేసరికి బస్సులోకి వైరు కాలుతున్న వాసన రావడాన్ని కొందరు గమనించారు. మిగతా వారు కూడా నిజమేనని అంటుండగా పొగి కనిపించింది. కాస్త భయపడ్డారు. పొగ క్షణాల్లో దట్టంగా కమ్మేస్తుండడంతో ఒకటే కలవరం. డ్రైవర్‌ బస్సును ఆపిన వెంటనే ప్రయాణికులంతా పరుగులు తీశారు. బస్సుకు దూరంగా వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే..

రాజాం - పాలకొండ మార్గంలో పల్లెవెలుగు ఆర్టీసీబస్సు మంగళవారం ఉదయం పాలకొండ వెళ్తోంది. బస్సులో 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. సరిగ్గా సంకిలి బస్టాప్‌ వచ్చేసరికి ఇంజన్‌ నుంచి పొగలు వచ్చాయి. గమనించిన డ్రైవర్‌ అప్రమత్తమై బస్సు నిలిపేశాడు. ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ వేగంగా దిగేందుకు ప్రయత్నించారు. బస్సు కింది భాగంలో వైర్లు షార్టుసర్క్యూట్‌ కావడంతో చిన్నగా మంటలు పుట్టి పొగలు వ్యాపించినట్లు చెబుతున్నారు. బస్సులోపల, బయట కూడా పొగ దట్టంగా కమ్మేయడంతో స్థానికులు కూడా టెన్షన్‌ పడ్డారు. కొందరు నీళ్లు తెచ్చి అదుపు చేశారు. ఈఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకొన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 11:59 PM