Share News

SMC Elections నేడు ఎస్‌ఎంసీ ఎన్నికలు

ABN , Publish Date - Sep 28 , 2026 | 10:52 PM

SMC Elections Today జిల్లాలోని 1,698 ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ)లు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఈనెల 15న నోటిఫికేషన్‌ జారీ చేశారు. 18న పాఠశాలల పరిధిలోని విద్యార్థుల తల్లిదండ్రులు జాబితాను ప్రదర్శించారు. 25న తుది జాబితాలను వెల్లడించారు. కాగా నేడు ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. పాఠశాలల పరిధిలో ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేతులెత్తే పద్ధతిలో సభ్యులను ఎన్నుకుంటారు.

SMC Elections   నేడు ఎస్‌ఎంసీ ఎన్నికలు
ఎస్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధమైన ప్రభుత్వ పాఠశాల

గరుగుబిల్లి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 1,698 ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ)లు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఈనెల 15న నోటిఫికేషన్‌ జారీ చేశారు. 18న పాఠశాలల పరిధిలోని విద్యార్థుల తల్లిదండ్రులు జాబితాను ప్రదర్శించారు. 25న తుది జాబితాలను వెల్లడించారు. కాగా నేడు ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. పాఠశాలల పరిధిలో ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేతులెత్తే పద్ధతిలో సభ్యులను ఎన్నుకుంటారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక అనంతరం నూతన కమిటీలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. పాఠశాలల్లో ప్రతి తరగతికి ముగ్గురు సభ్యుల చొప్పున కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, సామాజిక వర్గాలకు చెందిన వారు ఒక సభ్యుడిగా ఉండాలి. ఏకగ్రీవం కాకుంటే ఎన్నిక నిర్వహించనున్నారు. కమిటీకి కన్వీనర్‌గా పాఠశాల హెచ్‌ఎం ఉంటారు. ఉపాధ్యాయుల నుంచి ఒకరు, విద్యావేత్త ఒకరు, వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఒకరు, శిశు సంక్షేమశాఖ నుంచి ఒకరిని నామినేట్‌ చేయనున్నారు.

నేతల ప్రత్యేక దృష్టి

ఈ ఎన్నికలపై పలు రాజకీయ పార్టీల నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామస్థాయిలో తమ పార్టీలకు చెందిన మద్దతుదారులను ఎన్నిక చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలా ఉండగా పలు గ్రామాల పరిధిలోని పాఠశాలల్లో ప్రశాంతంగా ఎన్నిక జరిగేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపడుతున్నారు. ఘర్షణలు, వివాదాలకు తావులేకుండా పోలీస్‌ స్టేషన్లకు సమాచారం అందించారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావును వివరణ కోరగా.. ‘ ఎస్‌ఎంసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రశాంత వాతావరణంలో అంతా జరిగేలా చర్యలు చేపడుతున్నాం. ముందస్తుగా పోలీస్‌స్టేషన్లకు సమాచారం అందించాం. ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలను ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు అందించాం.’ అని తెలిపారు.

Updated Date - Sep 28 , 2026 | 10:52 PM