Share News

SMC Elections 29న ఎస్‌ఎంసీ ఎన్నికలు

ABN , Publish Date - Sep 16 , 2026 | 12:00 AM

SMC Elections on 29th జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే స్థానిక ఎన్నికల సందడి మొదలైౖంది. తాజాగా ప్రభుత్వం స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో క్షేత్రస్థాయిలో పరిస్థితి మరింత వేడెక్కనుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఎస్‌ఎంసీ ఎన్నికల కోసం ఈ నెల 18న ఓటర్ల జాబితా విడుదల, 25 వరకు అభ్యంతరాల స్వీకరణ, 29న ఎస్‌ఎంసీ చైర్మన్‌, సభ్యులను ఎన్నుకోనున్నారు. పాఠశాలల హెచ్‌ఎంలు మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. ఎన్నికల షెడ్యూల్‌ను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాల్సి ఉంది.

SMC Elections   29న ఎస్‌ఎంసీ ఎన్నికలు
పార్వతీపురం మండలం పెదబొండపల్లి పాఠశాల నోటీస్‌ బోర్డులో ఎస్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రదర్శిస్తున్న దృశ్యం

  • ప్రభుత్వ పాఠశాలల్లో సందడి

  • గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రాజకీయ వేడి

పార్వతీపురం, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే స్థానిక ఎన్నికల సందడి మొదలైౖంది. తాజాగా ప్రభుత్వం స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో క్షేత్రస్థాయిలో పరిస్థితి మరింత వేడెక్కనుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఎస్‌ఎంసీ ఎన్నికల కోసం ఈ నెల 18న ఓటర్ల జాబితా విడుదల, 25 వరకు అభ్యంతరాల స్వీకరణ, 29న ఎస్‌ఎంసీ చైర్మన్‌, సభ్యులను ఎన్నుకోనున్నారు. పాఠశాలల హెచ్‌ఎంలు మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. ఎన్నికల షెడ్యూల్‌ను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాల్సి ఉంది. పాఠశాలల్లో ప్రతి తరగతికి ముగ్గురు సభ్యుల చొప్పున కమిటీ ఉంటుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు కనీసం ఒకరైనా ఉండాలి. ఈ కమిటీకి ఎన్నికలు జరిగితే ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఏకగ్రీవమైతే నిబంధనల ప్రకారం కమిటీని ప్రకటిస్తారు. ఎన్నికైన వారిలో ఒక చైర్మన్‌తో పాటు వైస్‌ చైర్మన్‌ సభ్యులను ఎన్నుకుంటారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా ప్రధానోపాధ్యాయులు వ్యవహరిస్తారు. ఉపాధ్యాయుల నుంచి ఒకరు, విద్యావేత్త ఒకరు, వైద్య ఆరోగ్యశాఖ నుంచి మరొకరు , శిశు సంక్షేమ శాఖ నుంచి ఒకరు స్వచ్ఛందంగా నామినేట్‌ చేస్తారు. కాగా గత ఏడాది ‘నువ్వానేనా’ అన్న రీతిలో టీడీపీ, వైసీపీ మద్దతుదారుల మధ్య ఈ ఎన్ని కలు జరిగాయి. ప్రస్తుతం జిల్లాలో నోటిఫికేషన్‌ జారీ ప్రక్రియ ప్రారంభం కావడంతో పాఠశాల కమిటీల ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీల మద్దతుదారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 1,698 పాఠశాలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ పాఠశాలలో 11032 మంది విద్యార్థులు చదువు తున్నారు. ‘జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఎన్నికలు ఈ నెల 29న జరగనున్నాయి. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేశాం. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.’ అని డీఈవో బ్రహ్మాజీరావు తెలిపారు.

Updated Date - Sep 16 , 2026 | 12:00 AM