Share News

విద్యార్థుల కోసం ‘స్మార్ట్‌బడి’

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:19 AM

పల్లిగండ్రేడు (ఆర్‌) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు ఎ.సురేష్‌కుమార్‌ ‘స్మార్ట్‌బడి’ అనే యాప్‌ను రూపొందించారు.

విద్యార్థుల కోసం ‘స్మార్ట్‌బడి’

  • యూప్‌ను రూపొందించిన ఉపాధ్యాయుడు సురేష్‌

గుర్ల, జూలై 4(ఆంధ్రజ్యోతి): పల్లిగండ్రేడు (ఆర్‌) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు ఎ.సురేష్‌కుమార్‌ ‘స్మార్ట్‌బడి’ అనే యాప్‌ను రూపొందించారు. పిల్లలకు విజ్ఞానం, వినోదం అందిం చేలా తయారుచేశారు. దీంతో ఉపాధ్యాయులంతా కలిసి జిల్లా అధికారుల దృష్టికి విష యాన్ని తీసుకువెళ్లారు. ఈ యాప్‌ను జిల్లా విద్యా శాఖాధికారి యు.మాణిక్యంనాయుడు తన కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఇది ప్రాథమిక తరగతుల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. సులువుగా విద్యను నేర్చుకోవ డానికి సహకరిస్తుందని అభిప్రాయ పడ్డారు. యాప్‌ వినియోగానికి నెట్‌ సౌకర్యం అవస రం లేదన్నారు. పూర్తిగా ఆఫ్‌లైన్‌లో పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్ల ఎంఈవోలు ఎస్‌.భానుప్రకాష్‌, ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి ఎంఈవో సీహెచ్‌.రమేష్‌, పెనుబర్తి జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కె.శ్రీనివాసరావు, యాప్‌ రూపకర్త ఎ.సురేష్‌ కుమార్‌, ఉపాధ్యాయుడు గురుమూర్తి పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 12:19 AM