పోలీసుల ఎదుటే గొంతు కోసుకుని..
ABN , Publish Date - Aug 05 , 2026 | 12:08 AM
భార్య తనపై పోలీసుల కు ఫిర్యాదు చేసిందనే మనస్తాపంతో ఓ భర్త పోలీస్‌స్టేషన్ లో పోలీసుల ఎదుటే బ్లేడుతో గొంతు, చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
భార్య ఫిర్యాదు చేసిందని మనస్తాపంతో భర్త ఆత్మహత్యాయత్నం
వంగర, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): భార్య తనపై పోలీసుల కు ఫిర్యాదు చేసిందనే మనస్తాపంతో ఓ భర్త పోలీస్‌స్టేషన్ లో పోలీసుల ఎదుటే బ్లేడుతో గొంతు, చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. తలగాం గ్రామానికి చెందిన భార్యాభర్తలు కిమిడి శ్రీలత, కిమిడి సునీల్ మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. ఈక్రమంలో భర్త వేధింపులు తట్టుకోలేక భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు సునీల్‌ను విచారణ నిమిత్తం మంగళవారం సాయంత్రం స్టేషన్‌కు పిలిచారు. ఎస్‌ఐ షేక్ శంకర్ ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి, పంపించే ప్రయత్నం చేశారు. అయితే భార్య తనపై కేసు పెట్టిందన్న విషయం తెలుసుకుని తీవ్ర ఆవేశానికి గురైన సునీల్.. ఎవరూ ఊహించని విధంగా తన వద్ద దాచుకున్న బ్లేడుతో హఠాత్తుగా గొంతు, చేయి కోసుకున్నాడు. వెంటనే పోలీసులు ఆయన్ని 108 వాహనం ద్వారా రాజాం ఆసుప త్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నా రని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపినట్టు ఎస్‌ఐ శంకర్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.