మేడపై నుంచి జారిపడి..
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:16 AM
మేడపై నుంచి జారి పడి చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
గజపతినగరం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): మేడపై నుంచి జారి పడి చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌నాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భోగాపురం మండలం ముడిదాం గ్రామానికి చెందిన కొట్యాడ కిరణ్‌కుమార్(29) ఓ ప్రైవేటు కంపెనీలో టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తూ గజప తినగరం పంచాయతీ శివారు గ్రామం ఎం.వెంకటాపురంలో అద్దె నివాసంలో ఉంటున్నాడు. ఈనెల 11న ఇంటి మేడ పైనుంచి ప్రమాదవ శాత్తు పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో ప్రథమచికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి సోదరి చంద్రిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.