Share News

భవంతి నుంచి జారిపడి..

ABN , Publish Date - Sep 11 , 2026 | 12:13 AM

భవన నిర్మాణ పను లకు వెళ్తూ.. ఇంటికి ఆధారంగా నిలిచిన ఇంటి పెద్ద ప్రమాదవ శాత్తు అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది.

భవంతి నుంచి జారిపడి..

  • భవన నిర్మాణ కార్మికుడి మృతి

  • కన్నీరు మున్నీరైన భార్య

నెల్లిమర్ల, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణ పను లకు వెళ్తూ.. ఇంటికి ఆధారంగా నిలిచిన ఇంటి పెద్ద ప్రమాదవ శాత్తు అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. వివరాలు ఇలా ఉన్నాయి. గుర్ల మండలం గూడెం గ్రామానికి చెందిన పెందర్తి పైడిరాజు (21)కు భార్య లక్ష్మితో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈయన భవన నిర్మాణ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎప్పటిలా గే గురువారం నెల్లిమర్ల మండలంలోని జర్జాపేట గ్రామంలో ఓ ఇంటిలో తాపీపనికి వెళ్లాడు. తాపీపని చేస్తుండగా ప్రమాదవశాత్తు భవంతి పైనుంచి జారిపడ్డాడు. వెంటనే స్థానికులు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం తెలుసుకు న్న భార్య అక్కడికి చేరుకుని.. ఇక తమ కుటుంబానికి ఆధారం ఎవరంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. అందిన ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల ఎస్‌ఐ గోపాలరావు కేసు నమోదు చేశారు.

Updated Date - Sep 11 , 2026 | 12:13 AM