రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:05 AM
ఆర్టీసీ బస్సు, మినీవ్యానును ఢీకొన్న ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి.
బొండపల్లి, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సు, మినీవ్యానును ఢీకొన్న ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని గొట్లాం గా యత్రీ కళాశాల సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్థాని క ఏఎస్‌ఐ లెంక గోపి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పార్వతీపురం నుంచి విజయనగరం వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న మినీవ్యానును ఢీకొ ట్టింది. ఈ ప్రమాదంలో గజపతినగరం మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన వ్యాను డ్రైవర్ మీసాల కాళీ, బొండపల్లి మండలం నెలివాడకు చెందిన పి.రమే ష్, విజయనగరం ఉడా కాలనీకి చెందిన కె.అప్పలరాజు, అయ్యన్నపేటకు చెంది న షర్మిలారాణి, కొత్తపేటకు చెందిన జేవీ సత్యనారాయణలతోపాటు బాడంగి మండలం గజరాయనివలసకు చెందిన తుమ్మల అప్పన్నలకు తీవ్ర గాయాల య్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
లారీ ఢీకొని ఒకరికి గాయాలు
భోగాపురం, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ పి.సూర్యకుమారి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భోగాపురం గ్రామానికి చెందిన వసంత శ్రీను అనే వ్యక్తి అదే గ్రామంలోని జాతీయ రహదారి ఎత్తుబ్రిడ్జి డౌన్ వద్ద మంగళవారం రోడ్డు దాటుతుండగా.. విశాఖ వైపు నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న కంటైనర్ లారీ ఢీకొంది. దీంతో శ్రీనుకు బలమైన గాయాలయ్యా యి. దీంతో క్షతగాత్రుడిని 108 వాహనంలో విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.