Share News

గంజాయి కేసులో ఆరుగురి అరెస్టు

ABN , Publish Date - May 23 , 2026 | 12:30 AM

సంతకవిటి ప్రాంతంలో గంజాయి తీసు కుంటున్న ఆరుగురిని సంతకవిటి పొలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు.

గంజాయి కేసులో ఆరుగురి అరెస్టు

రాజాం రూరల్‌, మే 22(ఆంధ్రజ్యోతి): సంతకవిటి ప్రాంతంలో గంజాయి తీసు కుంటున్న ఆరుగురిని సంతకవిటి పొలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. రాజాంలో గంజాయి కలకలం శీర్షికన ఈనెల 22న ఆంధ్రజ్యోతిలో ప్రచు రితమైన కథనంపై ఎస్పీ దామోదర్‌ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు రాజాం రూరల్‌ సీఐ ఉపేంద్ర పర్యవేక్షణలో శుక్రవారం సాయంత్రం సంతకవిటి ఎస్‌ఐ గోపాలరావు.. గంజాయి తీసుకుంటున్న ఆరుగురిని అరెస్టు చేశారు. వారిలో ఒకొక్కరి నుంచి ఐదు నుంచి పది గ్రాముల వరకూ గంజాయి లభ్యమైనట్టు పొలీ సులు తెలిపారు. అరెస్టు అయిన వారిలో సంతకవిటి మండలం ముకుందపురం గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థులు, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు ఉన్నారు. అయితే తెర్లాం మండలం నెమలాం గ్రా మానికి చెందిన ఓ విద్యార్థి రాజాంలో ఓ ప్రభుత్వ హాస్టల్‌లో విద్యార్థులకు గంజా యి అమ్మకం చేసినట్లు స్పష్టమైన ఆధారాలు సేకరించిన పొలీసులు.. ఆ విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే విషయాన్ని రాజాం రూరల్‌ సీఐ ఉపేంద్ర వద్ద ప్రస్తావించగా వాస్తవమేనని అంగీకరించారు.

Updated Date - May 23 , 2026 | 12:30 AM