Share News

బయోగ్యాస్‌ ప్లాంట్‌కు స్థల పరిశీలన

ABN , Publish Date - Jun 02 , 2026 | 11:59 PM

మండల కేంద్రంలో బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ర్టీయల్‌ రీసెర్చ్‌ ప్రతినిధుల బృందం మంగళవారం స్థల పరిశీలన చేశారు.

బయోగ్యాస్‌ ప్లాంట్‌కు స్థల పరిశీలన
చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలిస్తున్న బృందం

రామభద్రపురం, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ర్టీయల్‌ రీసెర్చ్‌ ప్రతినిధుల బృందం మంగళవారం స్థల పరిశీలన చేశారు. స్థానిక చెత్త సంపద కేంద్రం వద్ద బృందం ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ డాక్టర్‌ సూర్యతేజ, టెక్నీషియన్‌ బి.రాజా విలేకరులతో మాట్లాడారు. కిచెన్‌ వేస్ట్‌, అగ్రికల్చర్‌ వేస్ట్‌ వంటి సేంద్రియ వ్యర్థాలతో బయోగ్యాస్‌ తయారీ చేస్తామన్నారు. గ్రామాల నుంచి సేకరించిన సేంద్రియ వ్యర్థాల నుంచి బయోగ్యాస్‌ ఉత్పత్తి చేయవచ్చన్నారు. ప్లాంట్ల ఏర్పాటుకు ఇక్కడి పరిస్థితులపై అంచనా వేసి స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌కు సమగ్ర నివేదిక పంపిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎం.రత్నం, డిప్యూటీ ఎంపీడీవో వెంకటరమణ, పంచాయతీ ఈవో శ్రీనివాసరావు, స్వచ్చభారత్‌ ఎమ్మార్సీ జి.మధుసూదనరావు పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2026 | 12:00 AM