Share News

Sitarama Kalyanam on 27th 27న సీతారామ కల్యాణం

ABN , Publish Date - Mar 24 , 2026 | 12:02 AM

Sitarama Kalyanam on 27th ఉత్తరాంధ్రప్రాంతానికి ప్రముఖమైన క్షేత్రంగా వెలుగొందు తున్న నెల్లిమర్ల మండల రామతీర్థంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారామ కల్యాణాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

Sitarama Kalyanam on 27th 27న సీతారామ కల్యాణం

27న సీతారామ కల్యాణం

రామతీర్థంలో భారీ ఏర్పాట్లు

5లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా

25న గిరి ప్రదక్షిణ

వర్చువల్‌గా ప్రారంభించనున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌

నెల్లిమర్ల, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రప్రాంతానికి ప్రముఖమైన క్షేత్రంగా వెలుగొందు తున్న నెల్లిమర్ల మండల రామతీర్థంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారామ కల్యాణాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, వీఐపీ దర్శనం, క్యూలైన్‌లో ఉండే భక్తులకు తాగునీరు, ఉచిత ప్రసాదం పంపిణీకి ఇప్పటినుంచి ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. కల్యాణం ఆవరణంలో భక్తులకు ఎండ తగలకుండా చూడనున్నారు. ఎక్కడి నుంచైనా కల్యాణం వీక్షించేలా ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేయనున్నారు. అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ నిరంతరం సరఫరా చేయనున్నారు. ఆనవాయితీ ప్రకారం సింహాచల స్వామి వరాహలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు సమకూరుస్తారు. నవమి ఉత్సవాలను పురస్కరించుకుని మార్చి 25న గిరిప్రదక్షిణను ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

భక్తులు వివిధ ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వచ్చే అవకాశం ఉన్నందున ఆయా వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయనున్నారు. ఆలయం వద్ద రెండు ఫైర్‌ ఇంజన్లు సిద్ధంగా ఉంచనున్నారు. పారిశుధ్య నిర్వహణ, శానిటేషన్‌ను పంచాయతీరాజ్‌శాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగాలు చేపట్టనున్నాయి. ఆర్టీసీ ఆధ్వర్యంలో భోగాపురం, ముక్కాం, కోనాడ తదితర మత్సకార గ్రామాలకు నాలుగు బస్సులు ఏర్పాటు చేయనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి.

--------------------

Updated Date - Mar 24 , 2026 | 12:02 AM