వైభవంగా సీతారాముల డోలోత్సవాలు
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:43 PM
సంతకవిటి మండలంలోని గుళ్లసీతారాంపురం గ్రామంలో గల సీతారాముల డోలోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాలయం నుంచి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి సంతతోటలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో ప్రతిష్ఠించారు. అక్కడ స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించారు.
సంతకవిటి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): సంతకవిటి మండలంలోని గుళ్లసీతారాంపురం గ్రామంలో గల సీతారాముల డోలోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాలయం నుంచి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి సంతతోటలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో ప్రతిష్ఠించారు. అక్కడ స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఇస్తున్నారు. స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హారతులు, భజనలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనానికి ఏర్పాట్లు చేసినట్లు సర్పంచ్ రావు రవీంద్రచిన్నారావు తెలిపారు. ఉత్సవాలకు ఉమ్మ డి జిల్లాతో పాటు ఒడిశా నుంచి భక్తులు వస్తున్నారు.