Share News

సోదరి ఇంటికి వచ్చి..

ABN , Publish Date - Jan 17 , 2026 | 12:35 AM

తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని పాత కుడి కాలువలో పడిపోయి ఒడిశా యువకుడు మృతిచెందాడు.

సోదరి ఇంటికి వచ్చి..

గరుగుబిల్లి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని పాత కుడి కాలువలో పడిపోయి ఒడిశా యువకుడు మృతిచెందాడు. పండుగకు సోద రి ఇంటికి వచ్చి మృత్యువాతపడడంతో విషాదం నెలకొంది. గరుగుబిల్లి ఎస్‌ఐ ఫకృద్ధీన్‌ కథనం మేరకు.. ఒడిశాలోని రాయగడ జిల్లా గుణుపూర్‌ బ్లాక్‌కు చెందిన హంకి సూర్యం(33) సుంకి పంచాయతీ పరిధిలోని ఐటీడీఏ పార్కు ప్రాంతంలో నిర్వహిస్తున్న ఇటుక బట్టీలో పనిచేస్తున్న సోదరి కుమారి కుటుం బాన్ని చూసేందుకు గురువారం వచ్చాడు. సాయంత్రం బహిర్భూమికి అని వెళ్లి ప్రమాదవశాత్తు కుడి కాలువలో పడిపోగా ఈతరాకపోవడంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శుక్రవారం కాలువ ప్రాంతంలో గాలించడం తో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపు రం కేంద్రాసుపత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూర్యం కాకినాడ సమీపంలోని వెలగాంలో ఇటుక బట్టీలో పనిచే స్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పండగకు సోదరితో సరాదాగా గడుపుదామని వచ్చిన సోదరుడు మృతి చెందడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Updated Date - Jan 17 , 2026 | 12:36 AM