Sirimanu tree in Jonnavalasa జొన్నవలసలో సిరిమాను చెట్టు
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:21 AM
Sirimanu tree in Jonnavalasa ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడిమాంబ సిరిమానోత్సవంలో భాగంగా సిరిమాను వృక్షం విజయనగరం మండలం జొన్నవలసలో సాక్షాత్కరించింది. జొన్నవలకు చెందిన దివంగత బూర్లె రామునాయుడు కుమారులు శ్రీనివాసరావు, రవి కళ్లాల్లో ఈ చెట్టు సాక్షాత్కరించినట్టు అమ్మవారి ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు ఆదివారం తెలిపారు.
జొన్నవలసలో సిరిమాను చెట్టు
నేడు ఉదయం 9.30 గంటలకు బొట్టుపెట్టేందుకు ముహూర్తం
విజయనగరం కల్చరల్, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడిమాంబ సిరిమానోత్సవంలో భాగంగా సిరిమాను వృక్షం విజయనగరం మండలం జొన్నవలసలో సాక్షాత్కరించింది. జొన్నవలకు చెందిన దివంగత బూర్లె రామునాయుడు కుమారులు శ్రీనివాసరావు, రవి కళ్లాల్లో ఈ చెట్టు సాక్షాత్కరించినట్టు అమ్మవారి ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు ఆదివారం తెలిపారు. ఈ విషయాన్ని దేవదాయశాఖ సహాయ కమిషనర్, ఆలయ ఈవో కె.శిరీషకు తెలియజేశారు. సోమవారం ఉదయం సిరిమాను, ఇరుసుమాను వృక్షాలకు ఉదయం 9.30 గంటలకు బొట్టుపెట్టే కార్యక్రమం వుంటుందని ఈవో శిరీష తెలిపారు. ఎమ్మెల్యే అదితి గజపతి రాజుతో పాటు పైడిమాంబ భక్తులు, దేవదాయ శాఖ సిబ్బంది, అర్చకులు, భక్తులు, పాలకమండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గోనున్నారు.