Share News

ఎల్లమ్మా.. కరుణించమ్మా

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:14 AM

గంట్యా డ ఎల్లమాంబ సిరిమానోత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు.

ఎల్లమ్మా.. కరుణించమ్మా

గంట్యాడ, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): గంట్యా డ ఎల్లమాంబ సిరిమానోత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయం వద్ద క్యూ కట్టారు. సాయంత్రం సిరిమానోత్సవం ప్రారంభమయ్యింది. అధిక సం ఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎస్‌ఐ సాయికృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటుచేశారు. అలాగే బుడతనాపల్లిలో ఎల్లమాంబ తీర్థ మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు.

నేడు మరుపల్లిలో..

గజపతినగరం, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): మరుపల్లి గ్రామంలో వెలసిన ఎల్లమాంబ జాతర సందర్భంగా బుధవారం సిరిమాన్సోవం నిర్వహిం చనున్నారు. గ్రామంలో వెలసిన ఎల్లమాంబ, పరసురాముల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి, సాయంత్రం సిరిమానోత్సవం నిర్వహిస్తారు.

విజయనగరంలో సిరుల ఉత్సవం

విజయనగరం కల్చరల్‌, ఫిబ్రవరి 24(ఆంధ్ర జ్యోతి): నగరంలోని సంగీత కళాశాల సమీపం లో ఉన్న ఎల్లమాంబతల్లి సిరుల మహోత్సవాన్ని మంగళవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. పూజారి చందక సాయితేజ రాత్రి ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశారు. అనంతరం సిరిమానుకు ఒక వైపు బుట్టలో పూజారిని కూర్చోబెట్టి, మరోవైపు తాడు పట్టుకుని చుట్టూ తిప్పారు. కొంతమంది యువకులు తాళ్లతో కొట్టుకునే ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎల్లమాంబ పుట్ట దర్శనంతో పాటు సిరిమాను తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Updated Date - Feb 25 , 2026 | 12:14 AM