Share News

Sirimanotsavam on October 27 అక్టోబరు 27న సిరిమానోత్సవం

ABN , Publish Date - Aug 25 , 2026 | 12:35 AM

Sirimanotsavam on October 27 ఈ ఏడాది పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అక్టోబరు 27న జరుగనుంది. ఈ మేరకు పైడితల్లమ్మవారి జాతర మహోత్సవాల తేదీలు ఖరారు అయ్యాయి. ఆ వివరాలను దేవదాయశాఖ సహాయ కమిషనర్‌, ఆలయ పాలకమండలి సభ్యులు ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఆలయ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సహాయ కమిషనర్‌ కె.శిరీష మాట్లాడుతూ, అక్టోబరు 1 నుంచి నవంబరు 11వ తేదీ వరకూ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

Sirimanotsavam on October 27 అక్టోబరు 27న సిరిమానోత్సవం
కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న సహాయ కమిషనర్‌ శిరీష

అక్టోబరు 27న సిరిమానోత్సవం

పైడితల్లమ్మవారి జాతర మహోత్సవాల తేదీలు ఖరారు

దేవదాయశాఖ సహాయ కమిషనర్‌ శిరీష

విజయనగరం కల్చరల్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అక్టోబరు 27న జరుగనుంది. ఈ మేరకు పైడితల్లమ్మవారి జాతర మహోత్సవాల తేదీలు ఖరారు అయ్యాయి. ఆ వివరాలను దేవదాయశాఖ సహాయ కమిషనర్‌, ఆలయ పాలకమండలి సభ్యులు ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఆలయ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సహాయ కమిషనర్‌ కె.శిరీష మాట్లాడుతూ, అక్టోబరు 1 నుంచి నవంబరు 11వ తేదీ వరకూ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉత్సవాల్లో భాగంగా అక్టోబరు 1న మండల దీక్ష ప్రారంభం అవుతుందని, అదే రోజు ఉదయం 9.30 గంటలకు చదురుగుడి వద్ద పందిరిరాట వేస్తామని వివరించారు. అక్టోబరు 22న అష్టమి సందర్భంగా మండల దీక్ష వుంటుందన్నారు. అక్టోబరు 26న అమ్మవారి జాతరలో భాగంగా తొలేళ్ల ఉత్సవం, 27న సిరిమాను సంబరం జరుగుతుందన్నారు. నవంబరు 3న తెప్పోత్సవం, 10న ఉయ్యాల కంబాల ఉత్సవం నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు. నవంబరు 7న కలశజ్యోతి ఊరేగింపు, 11న చండీహోమం, పూర్ణాహుతి, మండల దీక్ష విరమణ వుంటుందన్నారు. ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. సమావేశంలో ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు, పాలకమండలి సభ్యులు ఎ.తామేశ్వరరావు, డాక్టరు పేరి రామయ్య, కృష్ణమూర్తి, గోపాల్‌రెడ్డి, ఎల్‌ స్వాతికుమారి, ఎల్‌ కుమారి, వి వెంకటలక్ష్మీ, కె తులసీ, పద్మావతిలతో కలిసి ఉత్సవాలకు సంబంధించిన తేదీల కరపత్రాలను అవిష్కరించారు.

Updated Date - Aug 25 , 2026 | 12:35 AM