అరసం జిల్లా అధ్యక్షుడిగా ‘సిరికి’
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:07 AM
అభ్యదయ రచయితల సంఘం (అరసం) జిల్లా అధ్యక్షుడిగా సిరికి స్వామినాయుడు ఎన్నికయ్యారు.
బెలగాం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : అభ్యదయ రచయితల సంఘం (అరసం) జిల్లా అధ్యక్షుడిగా సిరికి స్వామినాయుడు ఎన్నికయ్యారు. శనివారం పట్టణంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నికను నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షుడిగా గంటేడ గౌరునాయుడు, ప్రధాన కార్యదర్శిగా మల్లిపురం జగదీశఖ, కార్యదర్శిగా చందనపల్లి గోపాలరావులను ఎన్నుకు న్నారు. ఈ సందర్భంగా అరసం జాతీయ అధ్యక్షుడుపెనుగొండ లక్ష్మీనారా యణ, ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా గంటేడ గౌరునాయుడు మాట్లాడుతూ ఇకనుంచి స్నేహ కళాసాహితి, అరసం సంస్థలు సాహిత్య కార్యక్రమాలను సంయుక్తంగా నిర్వహిస్తామన్నారు. జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో 90 ఏళ్లుగా భారతీయ సాహిత్యాన్ని ఉన్నత మార్గంలో నడిపిస్తోందన్నారు. దేఽశంలోని అన్ని రాష్ట్రాలకు, ప్రాంతాల కు, భాషలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక సంస్థ అరసం ఒక్కటేనన్నారు. మే 23, 24న తిరపతిలో జరిగే అరసం రాష్ట్ర 20వ మహాసభలను అందరూ జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో అరసం రాష్ట్ర కార్యదర్శి కె.శరత్ తదితరులు పాల్గొన్నారు.