సర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:11 AM
సర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో జేవీఎస్‌ఎస్ రామ్మోహనరావు, మునిసిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి కోరారు.
బొబ్బిలి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): సర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో జేవీఎస్‌ఎస్ రామ్మోహనరావు, మునిసిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి కోరారు. గురువారం బొబ్బిలి మునిసిపాలి టీలోని పలు సచివాలయాల పరిధిలో ఓటర్ల నమోదు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియపై సమీక్షించారు. వివిధ పోలింగ్ స్టేషన్ల జరుగుతున్న నమోదు ప్రక్రియను పరిశీలించారు. మందకొడిగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో కొంతమంది ఉద్యోగులను సహకరించే విధంగా ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రామలక్ష్మి తెలిపారు. కార్య క్రమంలో ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ బలివాడ గౌరీశంకర్ , బీఎల్‌వోలు పాల్గొన్నారు.