Share News

‘సర్‌’ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లండి

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:13 AM

విజయనగరం నియోజక వర్గంలో జరుగుతున్న సర్‌ ప్రక్రియకు టీడీపీ తరపు న నియమితులైన బీఎల్‌ఏలు.. బీఎల్వోలకు సహకరించాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పిలుపునిచ్చారు.

‘సర్‌’ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లండి

  • బీఎల్వోలకు సహకరించండి

  • టీడీపీ బీఎల్‌ఏలకు ఎమ్మెల్యే అదితి పిలుపు

విజయనగరం రూరల్‌, జూలై 5(ఆంధ్రజ్యోతి): విజయనగరం నియోజక వర్గంలో జరుగుతున్న సర్‌ ప్రక్రియకు టీడీపీ తరపు న నియమితులైన బీఎల్‌ఏలు.. బీఎల్వోలకు సహకరించాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం స్థానిక టీడీపీ కార్యాలయంలో పార్టీ పరిశీలకుడు, వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ పీవీజీ కుమా ర్‌తో కలిసి ఆమె నగరం, మండల పరిధిలోని పార్టీ ఇన్‌చార్జిలు, క్లస్టర్‌, యూనిట్‌ ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎక్కడైనా సమస్యలుంటే స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని, పరిష్కారం కాకపోతే, తన దృష్టికి తీసుకు వస్తే.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాన న్నారు. పార్టీ పరిశీలకుడు కుమార్‌ మాట్లాడుతూ విజయనగరం నియోజకవర్గంలో ఆదివారం మధ్యాహ్నం 4 గంటల నాటికి సర్‌ ప్రక్రియ 40 శాతం జరిగిందని, రానున్న రెండు రోజుల్లో 60 శాతాని కి తీసుకువెళ్లాలని పార్టీ ఆదేశించిందని తెలిపారు. తాను కూడా విజయనగరం నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు, నగరంలోని పలు డివిజన్లలో ఈనెల 7, 8 తేదీల్లో పర్యటించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంటా రవి, పాసి అప్పలనాయుడు తో పాటు క్లస్టర్‌ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2026 | 12:13 AM