Single-Session Schools 16 నుంచి ఒంటిపూట బడులు
ABN , Publish Date - Mar 13 , 2026 | 11:45 PM
Single-Session Schools from the 16th ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ నెల 16 నుంచి ఒంటి బడులు నిర్వహించాలని శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వి.విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఒంటి పూట బడులు నిర్వహించాలని ఆదేశించారు.
సాలూరు రూరల్,మార్చి 13 (ఆంధ్రజ్యోతి ): ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ నెల 16 నుంచి ఒంటి బడులు నిర్వహించాలని శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వి.విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఒంటి పూట బడులు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో 1726 ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో ఒంటి పూట బడులు నిర్వహించేలా డీఈవో బ్రహ్మాజీరావు, డిప్యూటీ డీఈవోలు రాజకుమార్ తదితరులు చర్యలు చేపడుతున్నారు. పాఠశాలల వచ్చే విద్యార్థులకు వడదెబ్బ తగలకుండా నూట్రిషన్ అందించడంతో పాటు, జాగ్రత్తలు వివరించాలని ఉపాధ్యాయులకు ఎంఈవోలు సూచించారు.
తొమ్మిదో తరగతి విద్యార్థులకు ‘ పది ’పాఠాలు
జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థులకు శుక్రవారం టెన్త్ పాఠాల బోధన కార్యక్రమం ప్రారంభించారు. వచ్చే ఏడాది పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు, విద్యార్థులకు ఒత్తిడి లేని బోధన, అభ్యాసం లక్ష్యంతో ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఉన్న 183 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 11,314 మంది విద్యార్థులకు ‘పది’ పాఠాలను బోధించారు. వచ్చే నెల 23 నాటికి ప్రతీ సబ్జెక్ట్‌లో మూడేసి పాఠాలను పూర్తి చేయనున్నారు. ఇందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయులకు అందించింది.