మునిసిపల్ కార్యాలయం ముట్టడి
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:00 AM
తమ సమస్యలపై అధికారులు, పాలకవర్గం పరిష్కరించకపోవడంతో శనివారం కౌన్సిల్ మీటింగ్‌కు ముందు మునిసిపల్‌కార్యాలయాన్ని ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎం ప్లాయీస్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ముట్టడించా రు.
సాలూరు, జనవరి 31(ఆంధ్రజ్యోతి): తమ సమస్యలపై అధికారులు, పాలకవర్గం పరిష్కరించకపోవడంతో శనివారం కౌన్సిల్ మీటింగ్‌కు ముందు మునిసిపల్‌కార్యాలయాన్ని ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎం ప్లాయీస్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ముట్టడించా రు. ఆందోళన చేస్తున్న కార్మికుల వద్దకు మునిసిపల్ చైర్‌పర్సన్ జెఈశ్వ రమ్మ, వైస్‌చైర్మన్ వి.అప్పలనాయుడు, కమిషనర్ వెళ్లి కార్మిక నాయకుల తో చర్చలు జరిపి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్‌వై.నాయుడు, సాలూరు కమిటీ అధ్యక్ష, కార్యదర్శి శంకరరావు, రవి మాట్లాడుతూ మునిసిపాలిటీలో కాంట్రాక్టు విభాగంలో ఖాళీ అయిన పోస్టులకు వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని, పెరిగిన జనాభాకు తగ్గట్టుగా కార్మికుల సంఖ్యను పెంచాలని కోరారు. కార్యక్రమంలో మునిసిప ల్ వర్కర్స్ యూనియన్ నాయకులు జె.స్వప్న, పోలరాజు, వెంకన్న, మధుమోహన్, శ్రీను, సీత పాల్గొన్నారు.
హరితవనం ఏర్పాటుకు ఆమోదం
మటన్ అమ్మకాలను అధికారుల అనుమతి స్టాంపులతోనే అమ్మకాలు జరపాలని వైసీపీ కౌన్సిలర్ గొర్లె వెంకటరమణ కోరారు. మునిసిపల్ కార్యాలయంలో శనివారం చైర్‌పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మామిడిపల్లికి వెళ్లే తోవలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాల్సిందిగా అజెండాలో పొం దుపరిచారు. పట్టణం ఇప్పటికే ఇరుగ్గాఉందని, ఎక్కడపడితే అక్కడ వివిధ నాయకుల విగ్రహాలను పెట్టవద్దని, ప్రజలకు ఇబ్బంది లేనిచోట నాయకుల విగ్రహాలను ఏర్పాటుచేసే విధంగా ఆలోచన చేయాలని పలు వురు కౌన్సిలర్లు అధికారులను కోరారు. పట్టణ ముఖద్వారం ఐలవ్యూ సాలూరు వద్ద ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటుతోపాటు హరితవనం ఏర్పాటుకు మునిసిపల్ పాలకవర్గం ఆమోదం తెలిపాయి. కార్యక్రమంలో కమిషనర్ రత్నకుమార్ పాల్గొన్నారు.