Share News

Siberian Birds సైబీరియా పక్షుల సందడి

ABN , Publish Date - Jun 07 , 2026 | 12:00 AM

Siberian Birds Bring Seasonal Delight సీతానగరం మండలం చెల్లంనాయుడువలసలో సైబీరియా పక్షులు సందడి చేస్తున్నాయి. ఏటా జూన్‌ రెండో వారంలో వచ్చే ఈ వలస పక్షులు ఈ ఏడాది వారం ముందుగానే వచ్చేశాయి. మొత్తంగా వీటి రాకతో ఈ ప్రాంతం కళకళలాడుతోంది.

Siberian Birds   సైబీరియా పక్షుల సందడి
చెల్లంనాయుడువలసలో సందడి చేస్తున్న వలస పక్షులు

సీతానగరం, జూన్‌6(ఆంధ్రజ్యోతి): సీతానగరం మండలం చెల్లంనాయుడువలసలో సైబీరియా పక్షులు సందడి చేస్తున్నాయి. ఏటా జూన్‌ రెండో వారంలో వచ్చే ఈ వలస పక్షులు ఈ ఏడాది వారం ముందుగానే వచ్చేశాయి. మొత్తంగా వీటి రాకతో ఈ ప్రాంతం కళకళలాడుతోంది. వలస పక్షుల రాకను రుతుపవనాల ఆగమనానికి సూచికగా ఈ గ్రామస్థులు భావిస్తుంటారు. వర్షాలు కురిసి.. పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. ఏటా వాటి రాక కోసం వారు కూడా ఎదురుచూస్తుంటారు. కాగా ఖండాంతరాలు దాటి వచ్చే ఈ పక్షులు నెలల తరబడి ఇక్కడే ఉంటాయి. సువర్ణముఖి నది, పొలాల్లో ఇవి ఆహారాన్ని సేకరిస్తుంటాయి. చెట్లపై గూళ్లను పెట్టి సందర్శకులకు కనువిందు చేస్తుంటాయి. సంతానోత్పత్తి జరిగిన తర్వాత ఈ గ్రామాన్ని విడిచిపోతుంటాయి. మొత్తంగా ఈ వలస పక్షులను గ్రామస్థులు అతిథులుగా భావిస్తుంటారు. అయితే ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకుడు బి.శ్రీనివాసరావును వివరణ కోరగా.. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Jun 07 , 2026 | 12:00 AM