ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులు పెంచాలి
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:09 AM
రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులు 2,500 నుంచి 10 వేలకు పెంచాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనరు సీహెచ్ హరీష్ డిమాండ్ చేశారు.
డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ హరీష్
విజయనగరం దాసన్నపేట, జూలై 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులు 2,500 నుంచి 10 వేలకు పెంచాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనరు సీహెచ్ హరీష్ డిమాండ్ చేశారు. గురువారం కోట జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు తర్వాత జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేయడం దారుణమన్నారు. 19 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, సాక్షాత్తు ఓ మంత్రి ప్రకటించారని.. ఇప్పుడేమో జాబ్ క్యాలెండర్‌లో 2,070 పోస్టులు చూపడం అన్యాయమన్నారు. తక్షణమే కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు.